ఈటల రాజేందర్‌పై వేటుకు రంగం సిద్ధం..!
ఇప్పటికీ ప్రభుత్వంపైన, సీఎం కేసీఆర్‌పైన ఈటల చేసిన వ్యాఖ్యలపై మంత్రులతో పాటు కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు ఎదురుదాడి చేస్తూ కౌంటర్ ఇచ్చారు.;
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ వేటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికీ ప్రభుత్వంపైన, సీఎం కేసీఆర్‌పైన ఈటల చేసిన వ్యాఖ్యలపై మంత్రులతో పాటు కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు ఎదురుదాడి చేస్తూ కౌంటర్ ఇచ్చారు. తాజాగా పార్టీ నుంచి ఈటలను సస్పండ్ చేయాలని కరీంనగర్ జిల్లా నేతలు తీర్మానం చేశారు. ఈ మేరకు సిఫార్సు లేఖపై సంతాకాలు చేస్తూ సీఎం కేసీఆర్‌కు పంపించారు. పార్టీకి వ్యతిరేకంగా ఈటల మాట్లాడారని.. వెంటనే ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలని కరీంనగర్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు డిమాండ్ చేస్తున్నారు.