GHMC Imposes Fines : చెత్త పారేసినా.. బయట మూత్ర విసర్జన చేసినా రూ.100 ఫైన్

Update: 2025-03-06 11:00 GMT

రోడ్డుపై చెత్త వేసినా, బహిరంగ మూత్ర విసర్జన చేసినా రూ.100 చొప్పున జరిమానా విధించనున్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న విధానాన్ని కట్టుదిట్టం చేయనున్నారు. దుకాణదారులు రోడ్డుపై చెత్త వేస్తే, గోడలపై రాతలు రాస్తే, కాలువల్లో చెత్త వేస్తే రూ.1000 జరిమానా విధించనున్నారు. గోడలపై పోస్టర్లు అంటిస్తే రూ.2,000 జరిమానా విధించనున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా బ్యానర్లు, కటౌట్లు కడితే.. దానికి రూ.5 వేలు జరిమానా విధిస్తారు. నిర్మాణ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేస్తే రూ.5,000 జరిమానా చెల్లించాలి. బహిరం గంగా ప్లాస్టిక్ను కాలిస్తే, చెరువులు, రోడ్లపై ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తే రూ.5 వేలు జరిమానా చెల్లించాలి. ఇక నాలాల్లో చెత్త వేసిన వ్యక్తికి రూ. 10 వేలు జరిమానా విధిస్తారు.

Tags:    

Similar News