Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి అంతా రెడీ..

Khairatabad Ganesh : ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గణపతి మండపం కర్రల తొలగింపు పూర్తయ్యింది;

Update: 2022-09-08 16:06 GMT

Khairatabad Ganesh : ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గణపతి మండపం కర్రల తొలగింపు పూర్తయ్యింది. గణేశుడి శోభాయాత్రకు మూడు ట్రక్కులు ఏర్పాటు చేశారు. గణేశుడితో పాటు ఇరువైపులా ఏర్పాటు చేసిన త్రిశక్తి మహాగాయత్రి.. షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాల ఊరేగింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రెండు ట్రక్కులకు వెల్డింగ్‌ పనులు పూర్తయ్యాయి.

రాత్రి 11 గంటలకు కలశపూజ చేస్తారు. అర్థరాత్రి 12 గంటలకు విగ్రహాన్ని కదిలించనున్నారు. రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమై... రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు నిమజ్జనం పూర్తి కానుంది

Tags:    

Similar News