మంత్రులు, నేతలకు విలువ ఇచ్చే సంస్కారం టీఆర్‌ఎస్‌లో లేదు: ఈటల
తెలంగాణలో దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు.;
తెలంగాణలో దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. ఏళ్లుగా ఎస్సీలకు కేటాయించే నిధులు ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని అన్నారు. రెవెన్యూ సంస్కరణల వల్ల ఎస్సీలకు అన్యాయం జరిగిందని తెలిపారు. దళితుల భూములకు పాసు పుస్తకాలు రాక ఇబ్బంది పడ్డారని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.... సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే పరిమితమయ్యాయని ఈటల మండిపడ్డారు. మంత్రులు, నేతలకు విలువ ఇచ్చే సంస్కారం టీఆర్‌ఎస్‌లో లేదని ధ్వజమెత్తారు.