ఈటల రాజేందర్ మోకాలికి ఆపరేషన్
Etala Rajendar: ఈటల రాజేందర్ మోకాలికి వైద్యులు ఆపరేషన్ చేశారు.;
Etala Rajendar: ఈటల రాజేందర్ మోకాలికి వైద్యులు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఈటల వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉండగా.. మోకాలి ఆపరేషన్ కావడంతో మళ్లీ పాదయాత్ర చేస్తారా అన్న దానిపై అనుమానం నెలకొంది. హుజురాబాద్ నియోజకవర్గంలో 12 రోజులు పాదయాత్ర చేసిన ఈటల.. అనంతరం అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాదయాత్రకు బ్రేక్ పడింది. 22 నుంచి 25 రోజులు పాదయాత్ర చేస్తానని ఈటల ముందుగా ప్రకటించారు. మరోవైపు కోలుకొని పాదయాత్ర చేస్తారని బీజేపీ నేతలు అంటున్నారు.