కేటీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం.. మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ నాగరాజు అరెస్ట్
మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శినంటూ మోసాలకు పాల్పడ్డ మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ నాగరాజును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.;
మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శినంటూ మోసాలకు పాల్పడ్డ మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ నాగరాజును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 9 కార్పొరేట్ కంపెనీల నుంచి 39 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. వెబ్‌సైట్‌లో కార్పొరేట్ కంపెనీలు, ఆస్పత్రులు, విద్యా సంస్థలు, స్థిరాస్తి వ్యాపారుల నెంబర్లు నాగరాజు సేకరించినట్లు తెలిపారు. కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని.. ఎల్బీ స్టేడియంలో కటౌట్లు కట్టడానికి డబ్బులు వసూలు చేసినట్లు చెప్పారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. గతంలోనూ నాగరాజుపై 10 కేసులు ఉన్నాయన్నారు.