ఈ ఏడాది జూన్ మొదలుకుని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మొదలుపెట్టిన రేషన్ కార్డ్ ఈ-కేవైసీ అప్డేట్ కార్య క్రమంలో ఇప్పటివరకు ఇంకా 20శాతం వరకు లబ్ధిదారులు ఇంకా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోలేకపోయారు. అందుకు సాంకేతిక సమస్యలు కూడా ఒక కారణ మేనని ప్రభుత్వం గుర్తించింది. రేషన్ కార్డ్ ఈ-కేవైసీ చేయించకుంటే పథకాల లబ్దికి ఇబ్బందులు తప్పవన్న ఆందోళన నేపథ్యంలో ముగిసిన గడువును డిసెంబరు 91 వరకు పెంచింది. ఇదే చివరి అవకాశమని సర్కారు స్పష్టం చేసింది.