తెలంగాణ శాసనసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫార్ములా ఈ-రేసుపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో సభలో గందరగోళం ఏర్పడింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పైకి పేపర్లు విసిరారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఇదే సమయంలో తమపై కాంగ్రెస్ సభ్యులు పేపర్లు విసిరారని.. షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్య చెప్పు చూపించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఇరువర్గాల తీరుతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. బీఆర్‌ఎస్ కోతి చేష్టలను రాష్ట్ర సమాజం గమనిస్తోందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కాగితాలు చింపి స్పీకర్‌పై వేసి దళితుడైన గడ్డం ప్రసాద్‌ను అవమానించారన్నారు. ఎలాగైనా సభ నుంచి బయటకు రావాలని బీఆర్‌ఎస్ వ్యహరిస్తోందన్నారు.