Farm House Deal Case: ఫామ్‌హౌస్ డీల్ కేసు.. రామచంద్ర భారతికి బెయిల్..
Farm House Deal Case: ఫామ్‌హౌస్ డీల్ కేసులో.. చంచల్ గూడ జైలు నుంచి రామచంద్ర భారతి బెయిల్‌పై విడుదలయ్యారు.;
Farmhouse Deal Case: ఫామ్‌హౌస్ డీల్ కేసులో.. చంచల్ గూడ జైలు నుంచి రామచంద్ర భారతి బెయిల్‌పై విడుదలయ్యారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో A1 నిందితుడుగా ఉన్న రామచంద్ర భారతి.. 45రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.
అయితే జైలు నుంచి విడుదలైన వెంటనే మరో కేసులో ఆయన్ని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రామచంద్ర భారతిపై ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో పాటు మరో రెండు కేసులున్నాయి. మరోవైపు ఇదే కేసులో A3గా ఉన్న సింహయాజులు ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక A2 నందకుమార్‌ను మరో కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.