Telangana : రైతు భరోసా అలర్ట్... పంపిణీకి వేగంగా ఏర్పాట్లు

Update: 2024-12-12 14:00 GMT

రైతు భరోసా నిధులు సంక్రాంతి తరువాత జమ చేస్తామని ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ ప్రకటించారు. ఈ దిశగా ఈనెల 16 తరువాత అసెంబ్లీ వేదికగా రైతుభరోసా అమలు మార్గదర్శకాల పైన చర్చ చేసి తుది నిర్ణయం తీసుకోనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం రైతు భరోసా అమలు పైన నివేదిక ఇవ్వనుంది. అసెంబ్లీలో అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించిన తరువాత పథకం అమలు పైన ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రకటన చేయనుంది. అర్హత ఉన్న ప్రతీ రైతుకు అమలు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.

Tags:    

Similar News