Karimnagar: 'ధాన్యం కొంటారా..? పెట్రోల్ పోసుకోమంటారా..?'.. కొనుగోలు కేంద్రం వద్ద రైతుల నిరసన..
Karimnagar: ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు పెట్రోల్ డబ్బాతో ఆందోళన చేపట్టారు.;
Karimnagar (tv5news.in)
Karimnagar: ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు పెట్రోల్ డబ్బాతో ఆందోళన చేపట్టారు. దీంతో రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్తత తలెత్తింది. ఐకేపీ సెంటర్‌లో అధికారులు ధాన్యం కొనడం లేదని సిరిసిల్ల-కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. వెంటనే కొనుగోళ్లు చేపట్టాలంటూ పెట్రోల్ డబ్బాతో నిరసనకు దిగారు. మండల వ్యవసాయ శాఖాధికారి భూమిరెడ్డి ఏనాడు కొనుగోలు కేంద్రాల వద్దకు రాలేదని.. రైతులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సముదాయించడంతో రైతులు శాంతించారు.