తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్న కరోనా సెకండ్ వేవ్..!
తెలంగాణలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నిన్న మొన్నటి వరకు అంతా తేలికగా తీసుకోవడంతో... వైరస్ చెలరేగిపోయింది. వందలు దాటి వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.;
తెలంగాణలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నిన్న మొన్నటి వరకు అంతా తేలికగా తీసుకోవడంతో... వైరస్ చెలరేగిపోయింది. వందలు దాటి వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండడం తీవ్ర స్థాయిలో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్స్ అన్నీ దాదాపుగా నిండిపోయాయి. ఇక పై వైరస్ వేగంగా విస్తరిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
గత నాలుగు వారాల్లో కోవిడ్ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరిగాయని... ఏప్రిల్ చివరికల్లా తెలంగాణలో మరింత భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతాయని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే రాష్ట్రం మరో మహారాష్ట్రలా మారుతుందని హెచ్చరించారు. వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపించే ప్రమాదం ఉందని.. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించకపోతే ఆస్పత్రుల్లో బెడ్స్ కూడా దొరకని దుస్థితి నెలకొంటుందని డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు.