Constable Commits Suicide : పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ సూసైడ్

Update: 2025-04-14 13:15 GMT

సంబంధాలు కుదరక పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండతండాకు చెందిన గగులోత్ నీల(26)కు 2020లో AR కానిస్టేబుల్ ఉద్యోగం రాగా వరంగల్‌లో పని చేస్తున్నారు. శనివారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన ఆమె ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని చనిపోయారు. పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో తమ కూతురు సూసైడ్ చేసుకున్నట్లు నీల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నీలిబండ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కానిస్టేబుల్ నీలిమ ఆత్మహత్య చేసుకుందనే సమాచారంతో తండాకు చేరుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నీలిమ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News