Female Doctor Suicide Attempts : లైవ్ లో మహిళా డాక్టర్ సూసైడ్ అటెంప్ట్.. కారణం ఇదే
హైదరాబాద్‌లో ఓ మహిళా డాక్టర్ లైవ్ వీడియోలో ఆత్మహత్యాయత్నం సంచలనం రేపుతోంది. భర్త, అత్తమామల వేధింపులు భరించలేక డాక్టర్ ప్రణీత అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు. ట్యాబ్లెట్లు మింగుతూ సెల్ఫీ వీడియో తీసుకుని రిలీజ్ చేశారు బాధితురాలు. వేధింపుల గురించి ప్రస్తావిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. కర్మన్‌ఘాట్ జీవన్ ఆస్పత్రిలో బాధితురాలు చికిత్స పొందుతున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.