Fire Department : అప్రమత్తంగా అగ్నిమాపక దళం

హైదరాబాద్‌ నగరంలో అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు;

Update: 2023-02-19 09:23 GMT

వేసవిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ నగరంలో అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. పారిశ్రామిక వాడల్లో పర్యటించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు.. ప్రధానంగా స్క్రాప్‌ గోడౌన్లు, ఫర్నిచర్‌ గోడౌన్లపై ఫైర్‌ అధికారులు దృష్టిసారించారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అగ్ని ప్రమాదాల బారిన పడకుండా ఉండొచ్చని చెబుతున్నారు. భారీ అంతస్తుల భవనాలు, షాపింగ్‌ మాల్స్‌లో ఇప్పటికే తనిఖీలు నిర్వహించగా.. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కటిన చర్యలు తీసుకుంటామని కూకట్‌పల్లి డీఎఫ్‌వో సుధాకర్‌ వార్నింగ్‌ ఇస్తున్నారు.

Tags:    

Similar News