రైతు రుణమాఫీ, రాజీనామా సవాళ్ల నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ వార్ నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. హరీష్‌రావుపై వెలిసిన ఫ్లెక్సీలకు దీటుగా బీఆర్‌ఎస్ నేతలు రేవంత్‌రెడ్డిపై పోస్టర్లు అంటించారు.
రైతు రుణమాఫీపై చెప్పింది కొండంత, చేసింది మాత్రం రవ్వంత అంటూ పోస్టర్లపై రాశారు. దమ్ముంటే రాజీనామా చేయ్ రవ్వంత రెడ్డి అంటూ పోస్టర్లు వెలిశాయి. మరోవైపు.. శుక్వరారం దమ్ముంటే రాజీనామా చెయ్, రుణమాఫీ అయిపోయే, నీ రాజీనామా ఏడబోయే అగ్గిపెట్టె హరీష్ రావు అంటూ కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
రుణమాఫీ, ఆరు హామీలపై మొదటినుంచి రేవంత్ రెడ్డి, హరీశ్ రావు మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇది అసెంబ్లీలోనూ రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు రుణమాఫీ పూర్తి అయిందని సర్కారు చెప్పడంతో.. వార్ పీక్స్ కు చేరింది.