Jurala Project : జూరాల కు పెరిగిన వరద ఉదృతి... గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు

Update: 2025-07-19 06:45 GMT

జూరాలప్రాజెక్టు కు వరద ప్రవాహం పెరిగింది. గత కొన్ని రోజులుగా వర్షాలు ఎక్కువగా లేకపోవడం తో వరద నామ మాత్రం గానే ఉంది...ఐతే మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్ట్ కు మెరుపు వరదలు వచ్చాయి. వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండడంతో అధికారులు వెంటనే అప్రమత్త మయ్యారు. మొత్తం 23 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో భారీగా వరద నీరు శ్రీశైలానికి పోటెత్తుతుంది. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,15,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 23 గేట్ల ద్వారా.. 1,24,562 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317.520 మీటర్ల వద్ద కొనసాగుతుంది. వర్షాల ప్రభావం ఎక్కువ ఐతే వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. దిగువ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.

Tags:    

Similar News