Nizamsagar Floods : నిజాంసాగర్ కు వరద పోటు.. గేట్లు ఎత్తి దిగువకు విడుదల

Update: 2024-09-06 09:00 GMT

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జల వర ప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. గురువారం ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్ట్ లోకి 20 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. అంతే మొత్తంలో ప్రాజెక్ట్ 3 గేట్లను ఎత్తి మంజీర నదిలోకి నీటి పారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు. ప్రస్తుతం 1404.50 అడుగులకు చేరుకుంది.

ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.079 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు అప్రమత్తంగా ఉంటూ..వరద ప్రవాహానికి తగ్గట్టుగా నీటిని దిగువకు వదులుతున్నారు.

Tags:    

Similar News