వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు..!
సికింద్రాబాద్ లో ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాలు జోరుగా సాగుతున్నాయి.;
సికింద్రాబాద్ లో ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాలు జోరుగా సాగుతున్నాయి. భక్తి శ్రద్దలతో బోనాలను అమ్మవారికి సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. అమ్మవారిని ప్రముఖులతోపాటు .. సాధారణ భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చి బోనం సమర్పిస్తున్నారు. ఈసందర్భంగా పోతరాజుల విన్యాసాలు.. శివసత్తుల ఊరేగింపులతో సికింద్రాబాద్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.