అడవులను కాపాడితేనే జీవ వైవిధ్యం సాధ్యమవుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ అన్నారు. వృక్ష సంరక్షణ అనేది మన సంస్కృతి, సాంప్రదాయంలో భాగంగా ఉందన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా కేబీఆర్ పార్కులో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఈ శాఖ మంత్రిగా తానూ చెట్ల సంరక్షణలో భాగస్వామ్యం అవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అడవుల పరిరక్షణ ఆవశ్యకత అందరికీ తె లియాలనే ప్రతిఏటా మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, జీవజాలం మనుగడకు అడవులే ఆధారమన్న మంత్రి... జీవజాలానికి, వనాలకు విడదీ యరాని సంబంధం ఉందని చెప్పారు. అలాంటి అడవులను స్వలాభం కోసం నాశనం చేస్తూ మనిషి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారన్నారు. పర్యావణంలో సమతుల్యత లోపించి విపత్తుల బారిన పడుతున్నామన్నారు. పట్టణీకరణ, పరి శ్రమల స్థాపన, ప్రాజెక్టుల నిర్మాణం, పోడు వ్యవసాయం, ఇళ్ల నిర్మాణం వంటి కారణాలతో అడవులు నానాటికీ అంతరించిపోవడానికి కారణాలుగా చెప్పారు. భూ విస్తీర్ణానికి అనుగుణంగా అడవుల విస్తరణ లేకపోవడంతో గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వనమహోత్సవం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతుందన్న సురేఖ... ఇందు కోసం నిధులు కూడా భారీగానే ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.