వచ్చే ఏడాది నుంచి ప్రైవేట్ బడుల్లో 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే హైకోర్టుకు తెలుపగా, ఎలా అమలు చేయాలనేదానిపై ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. దేశంలో 2009లో తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రీ ప్రైమరీ, ఒకటో తరగతిలో 25% సీట్లు పేదలకు ఇవ్వాల్సి ఉంటుంది. దేశంలో TGతో పాటు మరో 6 రాష్ట్రాలు మాత్రమే దీనిని అమలు చేయడం లేదు.
ఈ మేరకు దేశంలో 2009లో తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టంలోని సెక్షన్12 (1)సీ ప్రకారం ప్రీ ప్రైమరీ, 1వ తరగతిలో 25 శాతం సీట్లు ఇవ్వాలి. దేశవ్యాప్తంగా ఇది అమలవుతుండగా.. తెలంగాణతో పాటు మరో 6 రాష్ట్రాలు మాత్రమే దీనిని అమలు చేయట్లేదు. దీంతో చట్టం అమల్లోకి వచ్చి ఏండ్లు గడుస్తున్నా ఈ 6 రాష్ట్రాలు అమలు చేయకపోవడంపై కేంద్రం ఒత్తిడి చేస్తోంది. ఉన్నత న్యాయస్థానాలు వెంటనే ఈ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చాయి.