KTR : ఫ్యూచర్ సిటీకి ఫ్యూచరే లేదు : కేటీఆర్

Update: 2025-08-18 08:00 GMT

సీఎం రేవంత్ రెడ్డి ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి ఫ్యూచరే లేదని, కేవలం తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న ఆయన ఆకాంక్ష నెరవేరదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజాధనం వృధా అవుతుందన్నారు. ఫార్మా సిటీ కోసం భూములిచ్చిన రైతులు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసి, దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే ఊహాజనిత ప్రాజెక్టును ప్రవేశపెట్టారని విమర్శించారు. బీ ఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 56 గ్రామాల పరిధిలో హైదరాబాద్ ఫార్మసిటీ కోసం 20 వేల ఎకరాలతో ప్రతిపాదనలను తయారు చేసిందని, స్థానిక రైతులు రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ భూములను ఫార్మాసిటీ కోసం ఇచ్చారని పేర్కొన్నారు. కొంత మంది రైతులు తమ భూములు ఇవ్వడానికి అప్పట్లో నిరాకరిస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫా ర్మాసిటీ కోసం సేకరించిన ప్రతి ఎకరాన్ని తిరిగి రైతులకు ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం అవే భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రైతులను నిండా మోసం చేశారని ఆరోపించారు. దాంతో వేలకోట్ల రూపాయల ఫార్మాసిటీ పెట్టుబడులు వెనక్కి పోయాయని, లక్షల ఉద్యోగాల కల్పన ఆగిపోయిందన్నారు. ఈ వ్యవహారంపై ప్రభు త్వం స్పందించి ప్రజలకు, రైతులకు స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేనిపక్షం లో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుం దని పేర్కొన్నారు.

Tags:    

Similar News