Kishan Reddy : గచ్చిబౌలి భూముల వేలం ఆపాలి.. కిషన్ రెడ్డి డిమాండ్

Update: 2025-03-28 08:15 GMT

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల వేలంపై మండిపడ్డారు. గచ్చిబౌలి గ్రామంలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి వేలం ప్రక్రియను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక వనరుల సమీ కరణ పేరిట గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి వేలం ప్రక్రియను ఉపసం హరించుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురువారం లేఖ రాశారు. ఆ భూమికి పక్కనే హైదరాబాద్ సెంట్రల్ యూని వర్శిటీలో చదువుతున్న విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు ఉన్నారన్నారు. ఆ భూమి అమ్మడం ఎవరికి కూడా ఆమోదయోగ్యం కాదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. వేలం వేయాలని నిర్ణయించిన ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూమికి ఆనుకుని జీవ వైవిధ్యానికి నెలవైన అనేక వృక్షజాలం, జంతుజాలం, సరస్సులు ఉన్నాయని తెలిపారు. ఇందులో 734 వృక్షజాతులు, 220 పక్షి జాతులతో సహా నెమళ్లు, వలస పక్షులు, మచ్చల జింకలు, నాలుగు కొమ్ముల జింకలు, అడవి పందులు, కొండ చిలువలు, భారతీయ నక్షత్ర తాబేళ్లు వంటి వైవిధ్య భరితమైన జీవజాతులు ఉన్నాయని ఆ లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వ భూముల అమ్మకంపై గతంలో మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు కట్టుబడి ఉంటారని, సహజసిద్ధంగా ఏర్పడిన కొండలతో సహా పర్యావరణ, జీవ వైవిధ్యానికి ఎలాంటి నష్టం చేకూర్చకుండా సంరక్షిస్తారని, ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని మనవి చేస్తున్నట్లు అందులో తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 నిబంధనల ప్రకారం ఇప్పుడు మీరు వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న 400 ఎకరాల భూమిని, దానిని ఆనుకుని ఉన్న 800 ఎకరాల భూమిని కలిపి జాతీయ ఉద్యానవనంగా ప్రకటించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో ఒకప్పుడు అడవులను, కొండలను తలపించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలు పట్టణీకరణ కార ణంగా ఒక కాంక్రీట్ అడవిలాగా మారిపోయి సహజసిద్ధమైన వాటి స్వరూ పాన్ని కోల్పోయాయి. ఆయా ప్రాంతాలలో ఎక్కడా ఒక చెట్టును, పుట్టను, కొండను వదలకుండా మొత్తం కాంక్రీట్ నిర్మాణాలతో నింపేశారు. సహజసిద్ధంగా ఏర్పడిన కొండలతో సహా పర్యావరణ, జీవ వైవిధ్యానికి ఎలాంటి నష్టం చేకూర్చకుండా సంరక్షిస్తారని, ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని మనవి చేస్తున్నాను అంటూ కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News