Gaddar : బీజేపీ కార్యాలయంలో బండిసంజయ్‌తో గద్దర్ భేటీ..
Gaddar : హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయానికి ప్రజాగాయకుడు గద్దర్ వెళ్లడం చర్చనీయాంశమైంది.;
Gaddar : హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయానికి ప్రజాగాయకుడు గద్దర్ వెళ్లడం చర్చనీయాంశమైంది. ఆలిండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్ నాయకులతో కలిసి... బీజేపీ ఆఫీసుకు వెళ్లారు. బండి సంజయ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలో నూతన పాతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలని కోరారు.
బండి సంజయ్, గద్దర్ మధ్య సంతోషకరమైన వాతావరణం కనిపించింది. కొత్త లుక్‌లో కనిపిస్తున్నావ్ అంటూ గద్దర్‌తో బండి సంజయ్ ముచ్చటించారు. గద్దర్ కూడా తనదైన శైలిలో సమాధానం చెప్పడంతో అక్కడున్న నేతలంతా కాసేపు నవ్వుకున్నారు.
ఇటీవల సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రధాని మోదీ సభకు గద్దర్ వెళ్లారు. ఇప్పుడు మళ్లీ డైరెక్ట్‌గా బీజేపీ ఆఫీసుకు వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో చర్చమొదలైంది.