హిమాయత్‌సాగర్ నుంచి భారీ మొత్తంలో నీటిని కిందకు వదలడంతో మూసీ నదిలో ప్రవాహం పెరిగింది. పై నుంచి వరదతో పాటు వచ్చిన చెత్త, ప్టాస్టిక్ వ్యర్థాలు మూసారాంబాగ్ వంతెన వద్ద అడ్డం పడి నదీ ప్రవాహానికి ఆటంకంగా మారాయి. చాదర్‌ఘాట్, మూసారాంబాగ్‌లోని శంకర్‌నగర్, మూసానగర్, రసూల్‌పుర తదితర బస్తీల్లోకి వరద పోటెత్తింది. హైడ్రా రంగంలోకి దిగి మూసారంబాగ్ వంతెన వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులు చేపట్టింది. గుర్రపు డెక్కతో పాటు.. గడ్డి, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించింది. రెండు జేసీబీలతో పాటు టిప్పర్లను అక్కడే ఉంచి చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తోంది. దీంతో వరద సాఫీగా ముందుకు సాగుతోంది. హైడ్రా ఎస్ ఎఫ్‌వో శ్రీనివాస్ నేతృత్వంలో డీఆర్ ఎఫ్, మెట్ బృందాలు , జీహెచ్ఈ ఎంసీ సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యాయి.