Shilpa Lay Out: శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్.. గచ్చిబౌలి ట్రాఫిక్‌ చిక్కులకు చెక్

Shilpa Lay Out: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ చిక్కులు తప్పించడంతో పాటు జూబ్లీహిల్స్‌ మీదుగా ఓఆర్‌ఆర్‌ వెళ్లేందుకు ఎంతో అనువైన శిల్పా లే ఔట్‌ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి రానుంది.

Update: 2022-11-25 10:25 GMT

Shilpa Lay Out: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ చిక్కులు తప్పించడంతో పాటు జూబ్లీహిల్స్‌ మీదుగా ఓఆర్‌ఆర్‌ వెళ్లేందుకు ఎంతో అనువైన శిల్పా లే ఔట్‌ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి రానుంది. ఇవాళ సాయంత్రం మంత్రి కేటీఆర్ శిల్పా లే ఔట్‌ ఫ్లై ఓవర్‌ ను ప్రారంభించనున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌నంబర్‌ 45 నుంచి ఐకియా మీదుగా ఈ కొత్త ఫ్లై ఓవర్‌ ద్వారా నేరుగా ఓఆర్‌ఆర్‌కు.. అక్కడి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికీ ఈజీగా చేరుకోవచ్చు.

శిల్పా లే ఔట్‌ ఫ్లై ఓవర్‌ ద్వారా గచ్చిబౌలి జంక్షన్‌లో ట్రాఫిక్‌ చిక్కులు తప్పుతాయి. గచ్చిబౌలి జంక్షన్‌లో రద్దీ సమయంలో పదివేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. హెచ్‌కేసీ పరిసరాల్లోని ఐటీ కంపెనీలకు ఈ ఫ్లై ఓవర్ తో ఎంతో సదుపాయం కలగనుంది. హైటెక్‌ సిటీ, హెచ్‌కేసీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ల మధ్య మంచి కనెక్టివిటీతో పాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు, ఔటర్‌ రింగ్‌రోడ్డుకుకూడా ఇది మంచి కనెక్టివిటీ అని అధికారులు తెలిపారు.

గడచిన ఆరేళ్లలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా జీహెచ్‌ఎంసీ పూర్తిచేసిన 17వ ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు వ్యయం.. భూసేకరణ, టీడీఆర్‌లతో సహా 466 కోట్లు. ఫ్లై ఓవర్‌ పొడవు 2వేల 810 మీటర్లు. నాలుగు లేన్లు.. రెండువైపులా ప్రయాణించవచ్చు. ఇక దీంతో గచ్చిబౌలి జంక్షన్‌లో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి.

Tags:    

Similar News