Street Dog Issues : కుక్కలు కనబడితే ఫోన్ చేయండి.. జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్
హైదరాబాద్ నగరంలో ప్రజలపై వీధి కుక్కల దాడులు పెరుగుతుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వీధి కుక్కల నియంత్రణపై దృష్టి సారించారు. వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంటే టోల్ ఫ్రీ నంబర్లు 040-21111111, 040-23225297కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని జీహెచ్ఎంసీ ట్వీట్ చేసింది. మీ ఏరియాలో కుక్కలున్నాయా.. అయితే ఈ టోల్ ఫ్రీ నంబరుకు వెంటనే కాల్ చేసి సమాచారమివ్వాలని అధికారులు కోరుతున్నారు.
డాగ్ క్యాచింగ్ టీంలు నేరుగా వచ్చి వీధి కుక్కలను సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్ చేస్తాయని తెలిపింది. ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా వీధికుక్కల దాడిలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరు చనిపోయారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వీధి కుక్కల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో వీధికుక్కల బెడదను నివారించేందు కు ఏఐఈ ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అప్రమత్తమైన జీహెచ్ ఎంసీ వీధి కుక్కల స్టెరిలైజేషన్, కుక్కల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది.