హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పాలకమండలి సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు పొటా పోటీగా నినాదాలు చేశారు. ఇరు పార్టీల కార్పొరేటర్లను మేయర్ హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపులు ఎవరు ప్రోత్సహించారో మీకు తెలియదా అని కార్పొరేటర్లను నిలదీశారు.
మేయర్ రాజీనామా చేయాలని.. పోడియాన్ని చుట్టుముట్టారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్‌ఎస్ అంటూ మేయర్ ఫైరయ్యారు. నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్‌కు సిగ్గుండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. బల్దియా రాజకీయం హీటెక్కింది.