గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు తెలుగు తమ్ముళ్ల శంఖారావం పూరించారు. ఎల్బీనగర్‌లో టీడీపీ ఎన్నికల సమావేశం ఏర్పాటు చేశారు. గ్రేటర్ TDP కన్వీనర్ అరవింద్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. వచ్చే GHMC ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు అరవింద్ కుమార్ గౌడ్. హైదరాబాద్‌లో టీడీపీ హయంలో జరిగిందే అభివృద్ధేని.. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ చేసేందేమి లేదన్నారు అరవింద్ కుమార్ గౌడ్. GHMC ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుతామన్నారు.