నేను అలా అనలేదు.. ట్రోల్స్‌పై స్పందించిన జీహెచ్‌ఎంసీ మేయర్..!

సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. హైదరాబాద్‌లో వర్షాలు, వరదలపై చేసిన కామెంట్లకు క్లారిటీ ఇచ్చారు.

Update: 2021-02-16 09:15 GMT

సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. హైదరాబాద్‌లో వర్షాలు, వరదలపై చేసిన కామెంట్లకు క్లారిటీ ఇచ్చారు. వందేళ్లలో ఎన్నడూ రానంత వర్షాలు పడకూడదని మాత్రమే తాను కోరుకున్నాను తప్ప.. వర్షాలు పడకూడదన్న ఉద్దేశంతో అనలేదని స్పష్టత ఇచ్చారు. తన మాటలను వక్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై క్లారిటీ ఇచ్చారు. షేక్‌పేట్ తహసీల్దార్ బదిలీ వ్యవహారంలోనూ తన ప్రమేయం ఏమీ లేదన్నారు మేయర్ విజయలక్ష్మి. బదిలీ అనేది రెవెన్యూ శాఖ వ్యవహారమని, దానితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

Tags:    

Similar News