గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు అంతర్జాతీయ పురస్కారం..!
తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజనకు అంతర్జాతీయ పురస్కారం దక్కింది.;
తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అంతర్జాతీయ పురస్కారం దక్కింది. గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్-2021 అవార్డు వచ్చినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. సమాజహితం కోసం సేవలు అందించినందుకు గాను ప్రపంచవ్యాప్తంగా 20 మంది మహిళలు ఎంపికయ్యారు. ఇందులో అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్, తమిళిసై ఉన్నారు. మార్చి 7న తమిళిసై ఈ అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకోనున్నారు