Godavari at Bhadrachalam: భద్రాచలం వద్ద మళ్లీ పెరిగిన గోదావరి నీటిమట్టం..

Godavari at Bhadrachalam: ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో నిర్మల్‌ జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది.

Update: 2022-09-12 09:49 GMT

Godavari at Bhadrachalam: ఎగువన కురుస్తున్న వర్షాలతో మరోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదీ ప్రవాహం పెరుగుతోంది. గోదావరి దగ్గర 9 లక్షల క్యూసెక్కులు దాటింది వరద. 41 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుండి గోదావరిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో అధికారులు తాలిపేరు ప్రాజెక్ట్‌ నుంచి కూడా గోదావరికి వరద నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది.

భద్రాచలం దగ్గర గోదావరి 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇప్పటికే గోదావరి దగ్గర స్నాన ఘట్టాలు.దుకాణాలు మునిగిపోయాయిఇంతకు ముందు వరదలతో భద్రాచలం తీవ్రంగా నష్టపోయింది. దీంతో ప్రస్తుత వరదలతో మళ్లీ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌లో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News