Hyderabad : హైదరాబాద్ లో భారీగా పెరిగిన బంగారం ధరలు

Update: 2025-01-22 09:15 GMT

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.860 పెరిగి రూ.82,090 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.750 పెరిగి రూ.75,250కి చేరింది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. కేజీ వెండి ధర రూ.1,04,000గా ఉంది. వాస్తవానికి పైన పేర్కొన్న రేట్లకు జీఎస్టీ, తయారీ మజూరి, తరుగు వంటి అదనపు ఖర్చులు ఉంటాయని వినియోగదారులు గుర్తించాల్సి ఉంటుంది.

మ‌రోవైపు.. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని ముందు నుంచే మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వారం రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో ముందుగానే కొనుగోలు చేయడం మంచిదని గత రెండు రోజుల నుంచి వ్యాపారులు సూచిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఆరంభం నుంచే బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడూ తగ్గినట్లు కనిపించినా కేవలం పది గ్రాముల ధరపై పది రూపాయలు మాత్రమే తగ్గింది.

Tags:    

Similar News