Hyderabad Bonalu : జులై 11న గోల్కొండ బోనాలు

Hyderabad Bonalu : ఈ ఏడాది ఆషాడ మాసం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.;

Update: 2021-06-21 10:45 GMT
Hyderabad Bonalu : ఈ ఏడాది ఆషాడ మాసం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. భాగ్యనగరంలో బోనాల ఉత్సవాల నిర్వహణపై ఆయన అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్థిక సహాయం కింద.. 15 కోట్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. జులై 11న గోల్కొండ బోనాలు, జులై 25న సికింద్రాబాద్‌ బోనాలు, ఆగస్టు 1న హైదరాబాద్‌ బోనాలు నిర్వహిస్తామని వెల్లడించారు. త్వరలో మరోసారి ఈ ఉత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహిస్తామన్నారు.
Tags:    

Similar News