Seethakka : పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త.. రూ. 104 కోట్ల బిల్లులు విడుదల
తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు మరో శుభవార్త అందించింది. వారికి చెల్లించాల్సిన రూ. 104 కోట్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం రేవంత్‌రెడ్డిఈ నిధులను విడుదల చేయడంతో కొద్దిసేపట్లో ఈ మొత్తాలు పంచాయతీ కార్యదర్శుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఎన్నడూ లేని విధంగా పంచాయతీ కార్యదర్శులకు ఏకకాలంలో రూ. 104 కోట్లు విడుదల చేసినందుకు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క..రేవంత్, భట్టి విక్రమార్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఈ చర్య తమ సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుందని అన్నారు. ఈ నిధుల విడుదలతో రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది.