TG : రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వందే : మంత్రి పొన్నం
రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం దే అని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అధికారులకు చెప్పండి అని రైతులు ఎవరు బయట అమ్ముకోవద్దు అని దూరం అవుతున్న మార్కెట్ లకు కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. అని మీకు దగ్గర ఉన్న కేంద్రాల్లో అమ్ముకోవాలి అని సూచించారు ఈసారి అత్యధిక పంటలు పండాయి అని కాళేశ్వరం లేకున్నా కాళేశ్వరం ద్వారా పంటలు పండాయి అంటున్నారు..రైస్ మిల్లర్ల విషయంలో ఎక్కడ ఇబ్బంది లేదు అని 20 మంది డిఫల్టర్ లు ఉన్నారు.. ప్రభుత్వ బకాయిలు చెల్లించి మీరు కొనుగోలు లో పాల్గొనాలి.. 101 మంది రైస్ మిల్లర్లు ఉన్నారు..వారు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు..అండర్ టేకింగ్ ఇచ్చారు.. మీరు ఎక్కడైనా ఇబ్బంది పెట్టినట్లైతే చర్యలు ఉంటాయి అని కోనుగోలు కేంద్రాల్లో మీరు అడ్డం పడితే చర్యలు తప్పవు మంత్రి హెచ్చరించారు రైతులు ధాన్యం అమ్మగానే అదేరోజు ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని అధికారులు ఆదేశించారు.