Governor Green Signal : కేటీఆర్‌పై కేసుకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్?

Update: 2024-12-13 07:00 GMT

ఈ-ఫార్ములా రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్‌పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. రేసుకు ముందే నిర్వహణ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ ఇవ్వడంపై ప్రభుత్వం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రజాప్రతినిధి అయిన కేటీఆర్‌పై చట్టపరమైన చర్యల కోసం గవర్నర్ అనుమతి కోరింది. ఈ అంశంపై న్యాయసలహా తీసుకున్న గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. దీనికి సంబంధించి నిధుల అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి గానీ, ఆర్బీఐ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఓ విదేశీ కంపెనీకి అప్పటి ప్రభుత్వం నిధులు చెల్లించింది.

దాదాపు 46 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించింది అప్పటి మున్సిపల్ శాఖ. అయితే చెల్లింపుల్లో ఇటు హెచ్ఎండీఏ బోర్డు నుంచి అనుమతి పొందలేదు. అలాగే అప్పటికే కేసీఆర్ కేబినెట్ లో ప్రస్తావించలేదు. ఒక విదేశీ సంస్థకు నిధులు ఇవ్వాలంటే ఆర్బీఐ నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News