ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థుల ఎంపికపై హస్తం నేతల్లో కుదరని ఏకాభిప్రాయం
ఇతర పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకు పోతుంటే.. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికనే తేల్చలేకపోతుంది.;
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్‌లో ఈ సారి ఎన్నడూ లేని విధంగా ఆశావహులు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ కు, వరంగల్-ఖమ్మం-నల్లగొండ లకు చాలా మంది నేతలు పోటీకి తహతహ లాడుతున్నారు. రెండు స్థానాలకు పెద్ద ఎత్తున ఆశావహులు ఉండటంతో వాటిని ఫిల్టర్ చేసి.. అభ్యర్థిని ఎంపిక చేయాలని రాష్ట్రానికి వచ్చారు ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జ్ ఠాగూర్. గాంధీభవన్‌లో రెండ్రోజుల పాటు ముఖ్య నేతలు మరియు.. ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఆయా జిల్లా నేతలతో ఠాగూర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
అయితే.. ఈ సమీక్ష సమావేశంలో అభ్యర్థుల ఎంపిక అంశం ఎటూ తేల్చలేక పోయారు ఠాగూర్. కాంగ్రెస్ సీనినయర్లతో ఏకాభిప్రాయం సాధించలేక పోయారు. చివరికి అభ్యర్థుల ఎంపిక బాధ్యతను.. ఎమ్మెల్సీ జీ వన్ రెడ్డి నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కమిటీని నియమించి.. ఆ కమిటీకి బాధ్యతలు అప్పజెప్పారు. జీవన్ రెడ్డి కమిటీని రెండ్రోజుల పాటు ఆయా జిల్లా నేతలతో సంప్రదింపులు జరిపి ఫైనల్ గా హైకమాండ్ కు షాట్ లిస్ట్ పంపాలని ఆదేశించారు ఠాగూర్.
మరోవైపు.. మాణిక్యం ఠాగూర్‌నిర్ణయం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక కోసం రెండ్రోజులు సమీక్ష జరిపి చివరికి జీవన్ రెడ్డి కమిటీని వేసి వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ సీనయిర్లు. జీవన్ రెడ్డి కమిటీ వేయడానికి ఆయన హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉందా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఠాగూర్ తీర్చలేని ఎమ్మెల్సీ అభ్యర్థుల చిక్కుముడిని జీవన్ రెడ్డి కమిటీ విప్పుతుందా అని ప్రశ్నిస్తున్నారు.
మొత్తం మీద రెండు స్థానాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్‌లో పెద్ద దుమారమే రేగుతోంది. ఇతర పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకు పోతుంటే.. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికనే తేల్చలేకపోతుంది.