Balkampet Yellamma Kalyanam : బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి గ్రాండ్ గా ఏర్పాట్లు..
ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణాన్ని అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి కొండా సురేఖ ఎండోమెంట్ అధికారులను ఆదేశించారు. అమ్మవారి కల్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాలు ఏర్పాటు చేయాలన్నారు. దేవాలయం సమీపంలో అసంపూర్తిగా ఉన్న మల్టీ లెవెల్ కారు పార్కింగ్ నిర్మాణ పనులపై మంత్రి అధికారులతో ఆరా తీశారు. పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాలయంలో అమ్మవారి కల్యాణం, బోనాల పండుగ ఏర్పాట్లను స్థానిక ఎండోమెంట్ అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం బల్కంపేట అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.