Green India Challenge: నేను సైతం అంటోన్న విలన్...

'గ్రీన్ ఇండియా చాలెంజ్'లో పాల్గొడం చాలా ఆనందంగా ఉందంటోన్న సముద్రఖని; ఇదొక బృహత్తర కార్యక్రమమని ప్రశంసలు;

Update: 2023-01-04 09:45 GMT

తెలంగాణలో మొదలై దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో రాజకీయ నాయకులే కాదు సినీ తారలు, సెలబ్రిటీలు సైతం పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. తాజాగా డైరెక్టర్‌ శశికుమార్‌ ఈ ఛాలెంజ్‌ను విసరడంతో విలక్షణ నటుడు సముద్రఖని దాన్ని స్వీకరించారు. 


బుధవారం హైటెక్‌ సిటీలోని శిల్పారామంలో సముద్రఖని రావి మెక్కను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'గ్రీన్ ఇండియా చాలెంజ్' లో పాల్గొనే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు తప్పక పాల్గొనాలని చెప్పారు. అనంతరం ఈ ఛాలెంజ్‌ను మరింత ముందుకు తీసుకుపోవడానికి తన కుమారుడు హరివిఘ్నేశ్వరన్, కూతురు శివానీ, ప్రముఖ దర్శకుడు హెచ్.వినోత్ లకు 'గ్రీన్ ఇండియా చాలెంజ్'ను విసిరాడు.

Tags:    

Similar News