కాంగ్రెస్ సర్కారు చేతకానితనం వల్ల ఏడాది కాలంలోనే భూగర్భజలాలు పాతా ళానికి పడిపోయి సమైక్యరాష్ట్రం నాటి దుస్థితి నెలకొందని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. వ్యవసాయంపై అవగాహనలేని సీఎం రేవంత్ నిర్వాకం వల్ల 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. 'ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ముందుచూపు లేని ముఖ్యమంత్రి.. అసమర్థ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువు.. కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టడం వల్లే భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నది వాస్తవం. కోదండరెడ్డి రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా ఉంటూ ఉన్న వాస్తవాలు చెప్పాల్సిం ది పోయి.. వాటిని కప్పిపుచ్చి ఫిబ్రవరిలోనే ఎండలు ముదరడం వల్ల భూగర్భజలాలు పడి పోయాయనడం దారుణం. కళ్లముందు ఎం డిపోతున్న పంటలను కాపాడుకోలేక రైతులు విలవిలలాడుతుంటే.. బోర్లు వేసి ఆర్థికంగా నష్టపోవద్దని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులు పుకోవడం మరో విడ్డూరం. అసలు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో, దీని నుంచి గట్టేందుకు ఏం చేయాలో ఆలోచించకుండా పూర్తిగా చే తులెత్తేయడం అన్నదాతలను వంచించడమే. రాజకీయ కక్షతో నిర్లక్ష్యం చేసిన కాళేశ్వరం ప్రా జెక్టుకు అవసరమైన మరమ్మతులను వెంటనే పూర్తిచేసి రివర్స్ పంపింగ్ ద్వారా యుద్ధప్రాతిప దికన రిజర్వాయర్లు, చెరువులు, కాల్వలు నింపి ఎండిపోయే దశలో ఉన్న పంటలను కాపాడాలి. లేకపోతే రాష్ట్ర రైతులు కాంగ్రెస్ పార్టీని, ఈ ముఖ్యమంత్రిని ఎప్పటికీ క్షమించరు' అంటూ ట్వీటే చేశారు.