గ్రూప్-1 ఫలితాల్లో టాప్-500లో 45.6% మంది బీసీలే ఉన్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఓసీలు 36.4%, ఎస్సీలు 10%, ఎస్టీలు 7.6% ఉన్నట్లు వెల్లడించింది. ఫలితాలపై తప్పుడు ప్రచారం నమ్మొద్దని సూచించింది. మెరిట్ ప్రకారం, పారదర్శకంగా జాబితాను రిలీజ్ చేశామని తెలిపింది. రోస్టర్ ప్రకారమే పోస్టుల భర్తీ ప్రక్రియ ఉంటుందని వెల్లడించింది. ప్రతి అన్సర్ షీట్‌ను ఇద్దరు ఎవాల్యుయేటర్లు మూల్యాంకనం చేసినట్లు పేర్కొంది.
నేడు గ్రూప్-3 ఫలితాలు విడుదల కానున్నాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ రిలీజ్ చేయనుంది. గత ఏడాది నవంబర్ 17, 18న నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలకు 2,69,483 మంది హాజరయ్యారు. దాదాపు 49.76 శాతం అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 1,365 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రూప్-1, 2 ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది.