తాండూర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస
తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్నారు.
తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్నారు. మున్సిపల్ సాధారణ సమావేశంలో చర్చజరుగకుండానే ఎజెండా పాస్ చేయడంపై ప్రతిపక్ష కౌన్సిలర్లు తప్పుపట్టారు. ప్రతిపక్ష కౌన్సిలర్లు ఎజెండాను చించేసి వాక్ ఔట్ చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. మున్సిపల్ ఆవరణలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గీయులు మక్సూద్, నాయుమ్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒక రకంగా భయానక వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు వారిని అదుపుచేయడంతో గొడవ సర్ధుమణిగింది.