gulab tufan effect: గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
gulab tufan effect: గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే తెలంగాణ జిల్లాలో వర్సాలు కురుస్తున్నాయి.;
Gulab Tufan Effect in Telangana: గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే తెలంగాణ జిల్లాలో వర్సాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఈ తుఫాన్ తీవ్ర రూపం దాల్చి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తుఫాన్ ప్రభావం హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లతి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వర్సాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల కారణంగా జేఎన్టీయూహచ్ పరిధిలో సోమవారం జరగాల్సిన బీటెక్, బీఫార్మసీ పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే గులాబ్ తుఫాన్ ప్రభావం రెండ్రోజులపాటు తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలెర్ట్, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించినట్లు తెలిపారు. ఇతర శాఖలను సంప్రదిస్తూ సమన్వయంతో కలిసి పనిచేయాలని లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.