Weather Forecast : నేడు పలు జిల్లాల్లో వడగళ్ల వానలు.. 3 రోజులు ఇంతే!

Update: 2025-04-01 11:15 GMT

రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలతోపాటు అక్కడక్కడా వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 1న మంగళవారం పలు జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలొ "మీటర్ల వేగంతో ఈదురు గాలులు, వడగళ్లు కురుస్తాయని పేర్కొంది. ద్రోణి, మరో వైపు ఆవర్తన ప్రభావంతో తెలంగా ణలోని కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకా శాలు ఉన్నాయని చెప్పింది. ఈ నేపథ్యంలో మంగళవారం తెలంగాణలోని నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు న్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు.

రాష్ట్రంలోని వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో మోస్తరు వర్షాలతో పాటు వడ గండ్ల వానలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక బుధవారం ఆదిలా బాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచి ర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గురువారం కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. గురువారం నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాతి మూడు రోజులు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరత్వాడ దాని పరిసర ప్రాం తాలలో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఆవర్తనం ఏర్పడిందని, అదే సమయంలో దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి విదర్భ, మరత్వాడ సమీప ప్రాంతంలోని ఆవర్తనం మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతోందని వాతావరణశాఖ వివరించింది. రానున్న మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులు వడగండ్లతో కూడిన వర్షాలు ఉన్న కారణంగా మొక్కజొన్న తదితర పంటలు వేసిన రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News