Harish Rao : రైతుబంధు డబ్బులను బకాయిల కింద బ్యాంకులు జమ చేసుకోవద్దు ; హరీష్ రావు
Harish Rao : రైతులను బ్యాంకులు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయొద్దని తెలంగాణ మంత్రి హరీష్‌రావు అన్నారు.;
Harish Rao : రైతులను బ్యాంకులు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయొద్దని తెలంగాణ మంత్రి హరీష్‌రావు అన్నారు. సీఎస్ సోమేష్‌కుమార్‌తో కలిసి బ్యాంకర్లతో సమావేశమైన ఆయన.. రైతుబంధు డబ్బులను బకాయిల కింద బ్యాంకులు జమ చేస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. రైతుబంధు డబ్బులు సర్దుబాటు చేసి వెంటనే రైతుల అకౌంట్‌కి తిరిగి ఇవ్వాలన్నారు. కలెక్టర్లు మానిటరింగ్ చేయాలని.. రైతుబంధు విషయంలో ఇబ్బందుల పరిష్కారానికి రాష్ట్రస్థాయి టీమ్ పనిచేస్తుందని మంత్రి హరీష్‌రావు తెలిపారు.