ఇందిరా ఎమర్జెన్సీని తలపిస్తున్న రేవంత్ పాలన-హరీష్ రావు
రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పదుతున్నారంటూ విమర్శ;
తెలంగాణలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పాలన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్, మార్పు అంటూ అధికారం చేజిక్కించుకుని రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడటం తప్పించి మరే మార్పు తీసుకురాలేదని దుయ్యబట్టారు. నిర్భందాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప రేవంత్ తెచ్చిన మార్పు ఏమీ లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లన్నీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు.
మాజీ మంత్రి హరీశ్ రావుకు ఊరట
మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ హరీశ్ రావుపై పంజాగుట్టలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం విచారణ చేపట్టిన హైకోర్డు కీలక ఆదేశాలు ఇచ్చింది. అరెస్ట్ చేయోద్దని, విచారించుకోవచ్చని పోలీసులకు తెలిపింది. అలానే దర్యాప్తునకు సహకరించాలని హరీశ్ కు న్యాయస్థానం సూచించింది.
హరీష్ రావును అరెస్టు చేయడం హేమమైన చర్య
హైదరాబాదులో మాజీ మంత్రి హరీష్ రావును గురువారం కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేపించడం పిరికి పందె చర్య అని మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయకర్ ఖండించారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు కోసం డిమాండ్ చేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులతో కేసులు బనాయించి మంత్రి హరీష్ రావును అరెస్టు చేపించటం హేయమైన చర్యని ఆమె మండిపడ్డారు.