Harish Rao : తెలంగాణలో కేడీలు, బేడీల రాజ్యం నడుస్తోంది

Update: 2025-06-23 06:45 GMT

రాష్ట్రంలో కేడీలు, బేడీల రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి భయమని... నిద్ర లోనూ ఆయన పేరు తలచుకొని భయ పడుతున్నారని విమర్శించారు. బీఆ ర్ఎసథకాలకు కోతలు పెట్టడం తప్ప ముఖ్యమంత్రి ఏమి చేయలేదని సెటైర్ వేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన రైతు ధర్నాలో హరీశ్ మాట్లాడారు. 'ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. కోతల రేవంత్ రెడ్డి.. ఏ పథకానికైనా కోత పెడుతున్నాడు. రైతు అయితే చాలు గతప్రభుత్వం రైతుబంధు ఇచ్చింది. రేవంత్రెడ్డి ఓఆర్ఆర్ లోపల ఉన్నా రెండు లక్షల ఎకరాలు కు రైతుబంధు ఇవ్వట్లేదు. సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల రైతులపై పగ పెంచుకున్నాడు. రైతులకు బాకీబ డ్డ పైసలు ఇవ్వకపోతే స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఓట్ల రూపంలో వాతలు పెడ తరు. కేసీఆర్ హయాంలో ఆకాశా న్నంటిన భూముల ధరలు కాంగ్రెస్ పాలనలో ఢమాల్ అయ్యాయి. రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఆగమాగం చేస్తున్నాడు,సైకోలా ప్రవర్తిస్తున్నాడు. బనకచర్ల ఏడుందో ముఖ్యమంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటు. రేవంత్ తప్పులను ఎత్తి చూపించినందుకు ఓర్వలేక కౌశిక్ రెడ్డిని రాత్రికి రాత్రి అక్రమ కేసుల్లో ఇరికించారు. కేసీఆర్, కేటీఆర్ లపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టుడు తప్ప ఆయన చేసేందేమీ లేదు. అందాలపోటీలు పెట్టి అసభ్యకరంగా ప్రవర్తించి రాష్ట్ర పరువు తీశారు' అని అన్నారు.

Tags:    

Similar News