Harish Rao : రేషన్ షాపుల్లో మోడీ ఫోటో పెట్టాలనడం హాస్యాస్పదం : హరీష్ రావు

Harish Rao : హరీష్ రావు బీజేపీ నేతలపై మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Update: 2022-09-02 12:50 GMT

Harish Rao : రేషన్‌ దుకాణంలో ప్రధాని మోదీ ఫొటో ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు. ప్రధాని స్థాయిని దిగజార్చే విధంగా ఆమె ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు.. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

కొన్ని రాష్ట్రాలను సాకడంలో తెలంగాణ ప్రభుత్వం వాటా ఉందని... మరి ఆయా రాష్ట్రాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫొటో మీరు పెడతారా అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతల మాటలన్నీ అసత్యాలు, అర్ధసత్యాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్‌.

ఇటీవల తెలంగాణకు వచ్చిన కేంద్రహోంమంత్రి అమిత్‌షా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా ఒక్క ఎకరాకు నీరు రాలేదంటూ అపద్దాలు ప్రచారం చేశారన్నారు మంత్రి హరీష్‌. కాళేశ్వర్వం నీళ్లతోనే ... మెదక్‌, సిద్ధిపేట జిల్లాలు సస్యశ్యామలమైయ్యాయన్నారు. ఓ వైపు..కేంద్రమంత్రి గడ్కరీ... కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పొగిడితే.... అమిత్‌షా మాత్రం... గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు. ఇటీవల వరంగల్‌కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం... వరంగల్‌ హెల్త్‌ హబ్‌ కట్టలేదంటూ అపద్దాలు చెప్పారన్నారు. కానీ 15 శాతం పనులు పూర్తయినట్లు ఫోటోలు పెడితే బీజేపీ నేతల ఎవ్వరూ తిరిగి మాట్లడలేదంటూ ఎద్దేవా చేశారు హరీష్‌.

Tags:    

Similar News