TG : రేవంత్ పాలనపై 7న BRS చార్జిషీట్.. మాజీ మంత్రి హరీష్ ప్రకటన

Update: 2024-12-03 12:45 GMT

రెండు అంచుల పదునైన కత్తి కంటే రెండు నాలుకలతో విషం చిమ్మే పాముకంటే సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అంటూ మాజీమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు మండిపడ్డారు. అధికారంలోకి వస్తే రెట్టింపు రైతు బంధు అంటూ ఉత్తర ప్రగల్భాలు పలికి అధికారంలోకి రాగానే రైతుబంధును రద్దు చేసి రైతుల ఉసురు తీస్తున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైతుబంధు, రైతు బీమా కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ. 82వేల కోట్లు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. రైతుబంధుపై రైతులు మాట్లాడితే కౌలు రైతులకు, రైతులకు మధ్య చిచ్చుపెడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక పాలనపై ఈనెల 7న బీఆర్ఎస్ ఛార్జి షీట్ విడుదల చేయనున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ అసమర్థపాలకుని చేతిలో రాష్ట్రంలోని ప్రజలు అశాంతి, అభద్రత, ఆత్మహత్యలతో తల్లడిల్లుతున్నారని మండిపడ్డారు. టీడీపీలో ఉండి కాంగ్రెస్ ను రాక్షసులులంటాడు, కాంగ్రెస్ లో చేరి టీడీపీని వ్యతిరేకిస్తారు. టీఆర్ఎస్ లో చేరి టీడీపీని విమర్శిస్తారు. ప్రస్తుతం అధికారంలోకి రాగానే పదవిని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పై దూషణలు చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు.

Tags:    

Similar News